కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం (ఆగస్టు 28) జరిగిన తృణమూల్ ఛత్ర పరిషత్ (TMCP) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు మమతాతోపాటు టిఎంసి సమావేశ నిర్వాహకులపై హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. "కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందని... ఈ ఉల్లంఘనకు పాల్పడిన వారందరి పాత్రను దర్యాప్తు సమయంలో పరిశీలిస్తాము" అని పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు శుక్రవారం, కోల్‌కతాలోని కామాక్ స్ట్రీట్‌లోని పార్టీకి చెందిన 'అనధికార' బిల్ బోర్డు విషయంలో చర్యలు తీసుకుంటున్న పోలీసులపై దాడి చేసి, వారి విధులకు ఆటంకం కలిగించినందుకు టిఎంసి నాయకులు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.