
హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నీలాద్రి హాస్పిటల్‌లో చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నల్లగొండ జిల్లా పెద్దవూర గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ పిల్లలు పుట్టకుండా ఉండేందుకు శస్త్రచికిత్స (ఫ్యామిలీ ప్లానింగ్) కోసం నీలాద్రి ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. శస్త్రచికిత్సకు ముందు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మంజుల ప్రాణాలు తీశాయని బంధువులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











