మనతెలంగాణ/హైదరాబాద్:హైదరాబాద్ క్యూ ర్ పరిధిలోని ప్రజల సొంతింటి కల ను సాకారం చే యాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మ్మ ఇళ్ల టవర్స్ పథకంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర గృ హ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగ స్టు 15వ తేదీ శనివారం వరకు దరఖాస్తులను స్వీ కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని అసెం బ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా లక్ష ఇళ్ల ను నిర్మిస్తున్నామని, అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల ని ర్మాణాన్ని చేపట్టామని ఆయన వివరించారు.

ఇం దిరమ్మ ఇళ్ల్ల టవర్స్‌పై ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అయి తే రెండో శనివారం, బోనాల పండుగ తదితర వ రుస సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా గడువు పొ డిగించాలంటూ వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆగష్టు 10 వతేదీ నాటికి (సోమవారం) సాయంత్రం నాటికి మొత్తం 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినప్పటికీ, దరఖాస్తు ల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో ఎలాంటి జా ప్యం జరగకుండా చ ర్యలు తీసుకోవాలని మంత్రి అధికారుల ను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయిం పు ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

నియోజకవర్గాల వారీగా

వచ్చిన దరఖాస్తులు ఇలా

నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులు నియోజకవర్గం దరఖాస్తులు అంబర్‌పేటలో 3,073 బహదూర్‌పురాలో 1,706 ఇబ్రహీంపట్నంలో 1,031 కార్వాన్‌లో 2,184, ఖైరతాబాద్‌లో 5,518 కూకట్‌పల్లిలో 6,615, మహేశ్వరంలో 734, మలక్‌పేటలో 3,609, మల్కాజిగిరిలో 1,333, మేడ్చల్‌లో 1,668, నాంపల్లిలో 4,372, కుత్బుల్లాపూర్‌లో 5,571, రాజేంద్రనగర్‌లో 2,060, సనత్‌నగర్‌లో 1,404, సికింద్రాబాద్‌లో (కంటోన్మెంట్) 1,755, శేరిలింగంపల్లిలో 3,488 మొత్తం 46,121 దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు.