
బగోటా: కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూపంప తీవ్రత 7.4గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి 111 మంది మృతి చెందగా గాయపడిన వారి సంఖ్య వేలలో ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. మృతులు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. భూకంప ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 20కిపైగా మున్సిపాలిటీల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అప్పటికే పలు ఇండ్లు కూలిపోయాయి. వేల సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయి. పోలీసులు, ప్రభుత్వాధికారులు, పౌరులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కొలంబియా పొరుగున ఉన్న వెనెజువెలాలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొలంబియా భూగర్భంలో 107 కి.మీ. లోతున భూకంపం కేంద్ర నాభి ఉన్నట్టు సమాచారం. కొలంబియా అధ్యక్షుడు అబెల్లార్డో డి లా ఎస్ప్రియెల్లా సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునివ్వడంతో పాటు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు తమ మద్దతును, సానుభూతిని తెలియజేశారు.
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడిన వారు, ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న కొలంబియా ప్రజలందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయబ్ బుకెలే సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తాము కొలంబియా ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, మా రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, పారామెడిక్స్, అవసరమైన సామాగ్రిని కొలంబియన్ ప్రజలకు అవసరమైన సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని నాయబ్ బుకెలే తెలిపారు.











