
ఢిల్లీ: ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదలైన కాసేపటికే హోంమంత్రి అమిత్ షా సభకు రావాలంటూ విపక్షాల నినాదాలు చేశారు. లోక్ సభలో మళ్లీ గందరగోళం నెలకొన్నందున వాయిదా పడింది. పార్లమెంట్ మకరద్వారం వద్ద ఎన్ డిఎ ఎంపిల ఆందోళన చేశారు. విపక్షాలు పదేపదే సభను అడ్డుకోవడం సరికాదని, సభను సజావుగా సాగనివ్వండని స్పీకర్ ఓం బిర్లా కోరారు. అమిత్ షా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, సోమవారం కేంద్ర ప్రభుత్వం చెప్పిందని తెలియజేశారు. దేశ ప్రజలు చర్చ జరగాలని కోరుకుంటున్నారని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.








