
లండన్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండర్ ఆశుతోష్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. అక్కడి వన్డే కప్‌లో హ్యాంప్‌షైర్‌కు అశుతోష్ 4 మ్యాచుల్లో 13 వికెట్ల పడగొట్టాడు. ఇంగ్లండ్‌లోని వైవిధ్యభరితమైన పిచ్‌లపై తన మీడియం పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు.
దీనికి ముందు మ్యాచ్‌లో ఓ వికెట్ తీసిన అశుతోష్ అంతకు ముందు మ్యాచ్‌లో 4 వికెట్లు, దానికి ముందు మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలతో ఆశుతోష్ ఈ సీజన్‌లో హ్యాంప్‌షైర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతున్నాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఒకటి రెండు మెరుపులతో సరిపెట్టాడు. ఈ టోర్నీలో అశుతోష్ స్కోర్లు వరుసగా 10, 0, 11, 16 పరుగులుగా ఉన్నాయి.










