
ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఖర్చు దాదాపు 37.5 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 3.6 లక్షల కోట్లు) అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇందులో సెప్టెంబరు 30 వరకు అయ్యే ఖర్చు అంచనా వ్యయాలు కూడా ఉన్నాయన్నారు. పెంటగాన్‌కు సుమారు 67 బిలియన్ డాలర్ల అదనపు నిధులు కావాలన్న అభ్యర్థన నేపథ్యంలో రక్షణ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.











