చెన్నై: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు కేంద్రం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగులో కమిటీ కుర్రాళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మరికొన్ని చిత్రాలకు వివిధ కేటగిరిల్లో అవార్డులు దక్కాయి. తమిళ చిత్రాలకు కూడా అవార్డులు లభించాయి. విజయ్ సేతుపతి నటించి ‘మహరాజా’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హఇట్‌గా నిలిచిన విషయం తెలిందే. ఈ చిత్రంలో నటించిన బాల నటి సచనా నమీదాస్‌కు జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమె ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటనను లైవ్‌లో చూసిన సచనా.. తన పేరు వినగానే ఒక్కసారిగా ఎమోషనల్‌ అయి.. కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.