
న్యూఢిల్లీ: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గానూ కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’ పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రంగా ‘రాయన్’ నిలిచింది.
ఇక ఉత్తమ మ్యూజిక్ (నేపథ్యం) అవార్డు ‘అమరన్’ సినిమాకి గాను జివి ప్రకాశ్ కుమార్‌కు లభించింది. ఉత్తమ మేకప్ అవార్డు కమిటీ కుర్రాళ్లు చిత్రానికి పి. రవికుమార్‌కు దక్కగా.. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు పుష్ప2 చిత్రానికి గానూ దీపాలి నూర్, సీతల్ శర్మకు దక్కింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు కల్కి 2898 ఎడి సినిమాకి నితిన్ జిహానీ చౌదరికి లభించింది. బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) అవార్డు పుష్ప2 చిత్రానికి గాను సుకుమార్‌కి దక్కింది. ఇక ఉత్తమ నటి అవార్డు ఆర్టికల్ 370 చిత్రానికి యామి గౌతమ్‌కి దక్కగా.. ఉత్తమ నటుడు (షేర్డ్) చందూ ఛాంపియన్ చిత్రానికి కార్తిక్ ఆర్యన్, భ్రమయుగం సినిమాకి మమ్ముటికి లభించింది. ఉత్తమ ప్రజాదర చిత్రంగా కల్కి 2898 ఎడి నిలిచింది.











