
అమరావతి: మత్స్య కారుల గురించి మాట్లాడే హక్కు వైసిపికి లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అబద్ధాల పునాదిపై గొడ్డలి పార్టీ పుట్టిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి చౌకబారు వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని, డబ్బుపై ఆశతో తల్లి, చెల్లిని మోసగించిన వ్యక్తి మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి అని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసిపి హయాంలో 270 మంది మత్స్యకారులు చనిపోతే.. జగన్ కనీసం పైసా కూడా పరిహారం ఇవ్వలేదని, రోడ్డు ప్రమాదంలో సీదిరి అప్పలరాజు కుమారుడు ఒకరిని చంపేశారని మండిపడ్డారు. కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని, సిసి కెమెరాల్లో అసలు వాస్తవాలు బయటపడ్డాయని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.









