మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట ఖజానాకు జీఎస్టీ రాబడులను పెంచుకోవడంలో ఆర్టిఫీషియ ల్ ఇంటెలిజెన్స్‌ను (ఏఐను) వినియోగించడం ద్వారా పటిష్టమైన ప్రణాళికను రూపొందించడం పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో విస్తృతంగా చర్చలు జరిపారు. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సు బ్రమణియన్ శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా జీఎస్టీ, ఎ క్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై అరవిం ద్ సుబ్రమణియన్‌తో సిఎం చర్చించారు. రాష్ట్ర ఆ ర్ధిక పరిస్థితి మెరుగుపరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లే దిశగా జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత సమాచారంతో ప్రక్రియను సులభతరం చేసే వ్యవస్థను తీసుకురానున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియతో వ్యా పారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సిఎం సూచించారు. రాష్ట్ర ఖ జానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ను మెరుగు పరిచేలా టెక్నాలజీ వాడకం ఉంటోందని సుబ్రమణియన్ వివరించారు. ప్రధానంగా భవన, నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టే విధంగా మున్సిపల్, రెరా, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా సుబ్రమణియన్ సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాలు వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ డేటాతో పాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, సిఎం రిలీఫ్ ఫండ్ వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడు తుందని సిఎం చెప్పారు. ఈ సమావేశంలో సిఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కమర్షియల్ టాక్స్ అండ్ ఎక్సైజ్ సెక్రటరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.