మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జీఎస్టీ రాబడి వసూళ్లు గతేడా ది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో 35 శాతం అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో అధిక పనితీరును వాణిజ్య పన్నుల శాఖ న మోదు చేసింది. ఏప్రిల్ 2025లో రూ.3,433 కో ట్ల జీఎస్టీ రాబడి రాగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జీఎస్టీ రాబడి రూ.4,621 కోట్లుగా నమోదయ్యిం ది. గతేడాది కన్నా ఈ సంవత్సరం రూ.1,188 కో ట్ల రాబడి వాణిజ్య పన్నుల శాఖకు అధికంగా వ చ్చింది. దీంతో ఈ సంవత్సరం ఈ శాఖ 35 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

ఏప్రిల్‌లో వ చ్చిన రూ.4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికంగా వచ్చిన రాబడిగా నమోదు కావడం విశేషం. మార్చి 20 26 నె లలో వాణిజ్య పన్నుల శాఖకు రూ.4,231 కోట్ల రాబడి రాగా, ఏప్రిల్‌లో అది మరింత పెరగడం విశేషం. రాష్ట్ర జీఎస్టీ ఆ దాయం నాలుగు నెలలుగా నిరంతరం రూ.4 వేల కోట్లకు పై గా నమోదవుతోంది, జనవరి 2026 నుంచి వాణిజ్య పన్నుల శాఖ రాబడిని అధిగమిస్తూ వస్తోంది. ఈ నాలుగు నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వ సూలయిన మొత్తం ఆదాయంలో పెట్రోల్, మ ద్యంపై వచ్చిన పన్నులతో పాటు ఇతర పన్నులు కూడా ఉన్నాయి. ఇక, జీఎస్టీ ద్వారా నే రూ. 7,570 కోట్లు వసూలు కాగా, ఇది ఇప్పటివరకు ఇదే అత్యధికమని వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీల

ఆదాయం ద్వారా రూ.7,181 కోట్లు

రాష్ట్రంలో నమోదైన పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసిన ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీలతో కలిపి జీఎస్టీ ఆదాయం రూ.7,181 కోట్లుగా న మోదయ్యింది. ఇందులో సీజీఎస్టీ ద్వారా రూ. 2,092 కోట్లు, ఎస్జీఎస్టీ ద్వారా రూ.2,527 కో ట్లు, ఐజీఎస్టీ రూ.2,562 కోట్లుగా నమోద య్యిం ది. ఇది గతేడాదితో పోలిస్తే 12.6 శాతం వృద్ధిని సూచిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థా నంలో కర్ణాటక ఉంది. (ఏప్రిల్ 2025 నాటికి కర్ణాటక 14.5 శాతం వృద్ధిని నమోదు చేసింది). స్థిరమైన వ్యాపార అనుకూల వాతావరణం మద్దతుతో, కీలక రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు నిరంతరంగా తెలంగాణ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇది కొత్త పెట్టుబడులను ఆకర్షించి, ఇప్పటికే ఉన్న వ్యాపారాలు సమర్థవంతంగా విస్తరించడానికి వీలు కల్పించింది. తద్వారా ఉపాధి కల్పన, వినియోగం పెరిగింది. ఫలితంగా, అధిక ఆర్థిక కార్యకలాపాలు రాష్ట్రానికి మెరుగైన పన్ను వసూళ్లు, మొత్తం ఆర్థిక బలంగా పరిణమించాయి.