
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రాజౌరీ, ఫూంచ్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. వరద ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. రాజౌరీలో నదులు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా మునిగిపోయింది. అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బేలా కాలనీ సమీపంలో దార్హాలి నది రక్షణ గోడ ధ్వంసమైంది. అబ్దుల్లా బ్రిడ్జి సమీపంలోని 50కి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.











