చెన్నై: జనగనాయగన్ సినిమా వీక్షించిన అనంతరం ఓ వ్యక్తి తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని తన తండ్రికి బాలిక చెప్పడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు కావడంతో పాటు అరెస్టయ్యాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని కెకె నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... కెకె నగర్‌లో 11 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిగా ఉంటున్నారు. బాలిక తన తల్లిలో కలిసి ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటూ స్థానిక ఇళ్లలో పని మనిషిగా చేరింది. అప్పడప్పుడు తన కూతురును కూడా పని చేసే ఇళ్లలోకి తీసుకెళ్లేది. ఈ నెల 30వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయగన్ సినిమాకు తన తండ్రితో కలిసి వెళ్లింది. సినిమాలో లైంగిక వేదింపులకు సంబంధించిన సీన్ ఉండడంతో బాలిక గమనించింది. వెంటనే తనపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పింది. దీంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.