
ఆసియా గేమ్స్‌లో భారత్ సెమీ ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. పసికూన జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ 19.5 ఓవర్లలో 57 రన్స్‌కే ఆలౌట్ అయింది. జపాన్ బ్యాటర్లలో ఓపెనర్ అయకా కటో (25) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మరో ఓపెనర్ హరున ఇవాసాకి (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించడం గమనార్హం. తెలుగు అమ్మాయి శ్రీ చరణి (4/10) అద్భుత ప్రదర్శన చేసింది. షఫాలీ 2, శ్రేయాంకా పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.
ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 5 ఓవర్లలోనే చేధించింది. కమలిని డకౌట్ కాగా, భారతి (6) నిరాశ పరిచింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (40) రాణించింది. రిచా ఘోష్ (12 నాటౌట్) ఆటను ముగించింది.
ఇక సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో టీం ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియాపై శ్రీలంక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 160/4 స్కోరు చేయగా.. మలేషియా 74 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆదివారం మరో సెమీస్‌లో పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడనుంది.













