
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రైలు నం. 07787 కాచిగూడ - తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23న నడుపనున్నారు. రైలు నం. 07788 తిరుచానూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 24న నడుపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లోనూ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట్ల స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ రైలులో ఎసి II టైర్, ఎసి III టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.











