
సిద్దిపేట: కాళేశ్వరం జలాల కోసం రైతన్నలు కదం తొక్కారు. అనంతగిరి నుండి రంగనాయక సాగర్ వరకు రైతుల మహా పాదయాత్ర చేపట్టారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. రక్త పీపాసి సిఎం రేవంత్ రెడ్డి ఈగ కాసుకోవాలని, నీళ్ల కోసం మా రక్తం దారపోస్తామని, కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని రైతన్నలు నినాదాలు చేశారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని, ప్రాజెక్టులు నింపాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర కు వేలాది మందిగా తరలివచ్చి రిజర్వాయర్లను నీళ్లతో నింపాలని కోరారు.
-











