
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. తాజాగా భారత్ మరో రజత పతకాన్ని సాధించింది. పురుషుల లాంగ్ జంప్ విభాగంలో మురళీ శ్రీశంకర్ రజత పతకాన్నిగెలుచుకున్నారు. స్వల్ప తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయారు. ఆరు ప్రయత్నాలలో రెండవ ప్రయత్నంలో 8.09 మీటర్ల దూరాన్ని నమోదు చేసిన శ్రీశంకర్ రజత పతకాన్ని అందుకోగా.. స్కాట్లాండ్‌కు చెందిన స్టీఫెన్ మెకెంజీ 8.08 మీటర్ల దూరాన్ని నమోదు చేసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జమైకాకు చెందిన టేజే గేల్ 8.15 మీటర్ల ప్రదర్శనతో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు.
కాగా, శ్రీశంకర్ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ పతకాల సంఖ్య 13కు చేరుకుంది. ఈ క్రీడల ఏడవ రోజు ముగిసే సమయానికి భారత బృందం మొత్తం 15 పతకాలను (మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, మూడు కాంస్య పతకాలు) తన ఖాతాలో వేసుకుంది.











