
మన తెలంగాణ/హైదరాబాద్: “నేటి నుంచే కాం గ్రెస్ సర్కార్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. ప్రజలను దోచుకునే వారిని గద్దె దించుదాం.. ఢిల్లీ దర్బార్‌కు తెలంగాణ ఏటిఎంలా మారింది.. కాంగ్రెస్, -బిఆర్‌ఎస్, -మజ్లీస్ పార్టీలూ కలిసే ఉన్నా యి..” అని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ న్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మన ప్రయాణం ముగియలేదు.. పోరాటాలు ముందున్నాయి.. అ ని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఘ ట్‌కేసర్, అవుశాపూర్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో నితిన్ నబీన్ ప్రసంగించారు. రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని, రానున్న రోజుల్లో అధికారంలోకి రాబోతున్నామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మీరు కేవలం కార్యకర్తలే కాదు, పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దూతలు, సంస్థను బలోపేతం చేసే శక్తులు, తెలంగాణ ప్ర జలు రాష్ట్ర ఏ ర్పాటు సమయంలో కన్న కలలను సాకారం చేసే సేనానులు అంటూ ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. బిజెపి మహా వటవృక్షం కావడానికి కార్యకర్తల అంకితభావం, కష్టపడి చేసిన శ్రమకు ప్రతిఫలం అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో క్లిష్ట పరిస్థితులను కార్యకర్తలు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగినా, మా కార్యకర్తలు వేధింపులకు గురైనా, ఎన్నో కష్టాలు ఎదురైనా వారు తమ సంకల్పాన్ని విడిచిపెట్టలేదని ఆయన తెలిపారు. అందుకే కమలం వికసించడానికి కారణమైందని, ఆ విజయ ఘనత పూర్తిగా కార్యకర్తలదేనని అన్నారు.
రాష్ట్రంలోనూ ప్రజా సమస్యలపై పోరాటం
తెలంగాణలో ప్రజాసమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతికి వ్యతిరేకంగా మనమంతా ప్రజల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచాఇ్చరు. తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే, ప్రజల గొంతుకగా నిలవాలంటే వారి సమస్యలతో మమేకం కావాలని, ప్రజల సమస్యలపై పూర్తి శక్తితో ఉద్యమించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలనే తమ ఎన్నికల అజెండాగా చేసుకోకుండా, గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, మార్పు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలనూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలోని 30 లక్షలకు పైగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, 33 లక్షలకు పైగా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా సులభ రుణాలను పొందుతున్నారని ఆయన ఉదహరించారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు పసుపు సాగు చేసే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించే దిశగా కీలక అడుగుగా నిలిచిందన్నారు. తెలంగాణలో 83 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేశామని, అలాగే పేదల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్రంలో 1.32 కోట్లకు పైగా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించామని నితిన్ నబీన్ వివరించారు.
ఢిల్లీ దర్బార్‌ను ఖుషీ చేసేందుకు..
కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం కన్నా ఢిల్లీ దర్బార్‌ను సంతోషపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణను ఏటీఎంలా ఉపయోగించి ఢిల్లీలో తమ రాజకీయాలను నడిపిస్తున్నారని, నిజంగా తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే, ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికే ప్రజలకు చేరేవని ఆయన తెలిపారు. కేవరం ఆరు గ్యారంటీల పోస్టర్లు మాత్రం కనిపిస్తున్నాయని, కానీ ప్రయోజనాలు ప్రజలకు అందడం లేదని, ఈ వాస్తవాన్ని ప్రతి ఇంటికీ, ప్రతి ప్రజానీకానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన సూచించారు.
మార్పు ఢిల్లీ నుంచి రాదు..
రాష్ట్రంలో మార్పు ఢిల్లీ నుంచి రాదని, ప్రజలతో కలిసి పోరాడితేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రజలతో కలిసి నడుస్తూ, వారి ఆశయాలకు ప్రతినిధులుగా నిలబడితేనే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన సూచించారు. జాతీయ నాయకత్వానికి బలం రాష్ట్ర నాయకత్వం నుంచి వస్తుందన్న విషయాన్ని గమనించాలని అన్నారు. రాష్ట్ర నాయకత్వానికి బలం జిల్లా నాయకత్వం నుంచి లభిస్తుందని, జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వం బలంగా నిలుస్తుందని, మండల నాయకత్వానికి అసలైన శక్తి బూత్ స్థాయి నాయకత్వమే కాబట్టి బూత్ స్థాయి వరకు సంస్థను మరింత బలోపేతం చేయడం మన అందరి బాధ్యత అని ఆయన తెలిపారు. పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణను ప్రత్యేక మిషన్‌గా స్వీకరించిందని, ఆ మిషన్‌ను విజయవంతం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తదేనని నితిన్ నబీన్ అన్నారు.
మూడు పార్టీలూ కలిసే ఉన్నాయి..
రాష్ట్రంలో మజ్లిస్, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల మధ్య రాజకీయ కుమ్మక్కు కొనసాగుతోందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కుటుంబ పాలన, అవినీతి, హామీల అమలులో వైఫల్యాలకు ముగింపు పలకాలంటే మనమంతా మరింత శక్తివంతంగా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లను రద్దు చేసి, ఆ ప్రయోజనాలను ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు.
తెలంగాణను పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది: రాంచందర్ రావు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రసంగిస్తూ బెంగాల్ తరహా విజయాన్ని తెలంగాణలోనూ సాధించాలని పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషకరంగా లేదన్నారు. రేవంత్ రెడ్డి తాను చేయాల్సిన పనిని కిషన్ రెడ్డిని, మన పార్టీ ఎంపీలను, కేంద్రాన్ని చేయాలనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
యుగానికి ఒక్కరు ప్రధాని మోడీ
మూడు తీర్మానాలకు ఆమోదం
ఇదిలాఉండగా కార్యవర్గ సమావేశం మూడు తీర్మానాలను ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ యుగానికి ఒక్కరని, పన్నెండేళ్ళ మోడీ పాలనపై ఎంపీ ఈటల రాజేందర్, రాజకీయ తీర్మానాన్ని పార్టీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, కుదేలైన వ్యవసాయ రంగం, అల్లాడుతున్న రైతులకు సంబంధించిన తీర్మానాన్ని పార్టీ శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రతిపాదించారు. ఇంకా ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ ప్రసంగించారు.












