
రాజన్న సిరిసిల్ల: మిక్చర్ లో బల్లి కనిపించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ఓ స్వీట్ హౌస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... అరుణ్ చంద్ గాంధీచౌక్‌లోని ఓ స్వీట్ హౌస్‌లో బూందీ మిక్చర్, రింగ్స్ అమ్ముతున్నారు. వినియోగదారుడు మిక్చర్, రింగ్స్, స్వీట్స్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లిన తరువాత మిక్చర్ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా బల్లి కళేబరం కనిపించింది. వెంటనే స్వీట్ హౌస్‌కు చేరుకొని నిర్వహకుడిని ప్రశ్నించాడు. అతడు నిర్లక్షంగా సమాధానం చెప్పాడు. వెంటనే వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇటీవల పానీ పూరి తిని 20 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనుషను మీడియా ప్రతినిధులు అడిగారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకుంటామని, స్వీట్‌హౌస్‌లో తనిఖీలు చేసిన అనంతరం నిర్వహకుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.












