
ప్రస్తుతం ‘ఎన్‌బికె111’ చిత్రీకరణలో ఉన్న గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎన్‌బికె112’ను అధికారికంగా ప్రకటించారు. ‘ఎన్‌బికె112’కు సెన్సేషనల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్‌ను సామాజిక అంశాలతో మేళవించే కొరటాల శివ... బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయేలా ఒక బలమైన కథను సిద్ధం చేశారు. డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాత, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.












