
ఢిల్లీ: నీట్ విద్యార్థులు జరిపిన ఆందోళనకు స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీ తో కేంద్రంపై సిజెపి ఒత్తిడి తెచ్చింది. సిజెపి డిమాండ్లతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. సిజెపిలో చర్చలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీక్ వివాదంతో విద్యార్థులు రోడ్డెక్కారు. సిజెపి జంతర్ మంతర్ దగ్గర నెలరోజులుగా నిరసనలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామాకు సిజెపి పట్టుబట్టారు. తదుపరి సిజెపి పోరాటం ఫలించింది.
ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 10 రోజులుగా వరుస ఘటనలు తనను బాధించాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి అని కొనియాడారు. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశానని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని, దేశ ఐక్యత కొనసాగాలని, యువత తమ చదువు కోసమే సమయం కేటాయించాలని సూచించారు. మంత్రిగా ఇన్నాళ్లు నాకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ సేవకు తన అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నానని, నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే.. సిబిఐ విచారణకు ఆదేశించామని అన్నారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నానని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.











