
కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో కేరళ (పేరు మార్పు) బిల్లు, 2026 చట్టంగా మారింది. సంబంధిత బిల్లుకు లోక్‌సభ గత మంగళవారం ఆమోదం తెలిపింది. మరుసటి రోజే రాజ్యసభ కూడా బిల్లును ఆమోదించింది. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కోరుతూ 2024లో కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిందని తెలిపారు. రాష్ట్రం పేరును మార్చేందుకు అవసరమైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతూ ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్‌లో కేంద్రానికి పంపిందన్నారు.ఈ బిల్లు ప్రకారం కేరళ రాష్ట్రం ఇకపై ‘కేరళం రాష్ట్రం’గా పిలువబడుతుందన్నారు.











