నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ఒడిపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా పత్రాన్ని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆమోదించినట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరారు.

The post కేరళం సీఎం పినరయి విజయన్ రాజీనామా appeared first on Navatelangana.