
మనతెలంగాణ/హైదరాబాద్: శాసనసభ స్పీక ర్ డ్డం ప్రసాద్ కుమార్‌పై బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం చెలరేగింది. సిఎం రేవంత్‌రెడ్డితో పాటు బిజెపి, ఎంఐఎం సభ్యులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌పై బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యాలను ఖండించారు. ఈ సందర్భం గా ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ తక్షణమే క్షమాపణ చె ప్పాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అభ్యంతరకర భాష మాట్లాడిన ఎమ్మె ల్సీ తాతా మధును బిఆర్‌ఎస్ డిస్మిస్ చేయాలన్నారు. తాతా మధుతో రాజీనామా చేయించాలని లేకపోతే బర్తరఫ్ చేయాలని సిఎం సూచించారు. తాము ఏం మాట్లాడినా వెనుక కెసిఆర్ ఉన్నారని బిఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారం మా ట్లాడుతున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతా మధు వ్యాఖ్యలపై కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సోమవారం అ సెంబ్లీలో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చీకటి మిత్రులను కాపాడేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. స్పీకర్‌ను అవమానిస్తే స్పందించాల్సిన అవసరం బిజెపికి లేదా అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సభ్యుల హక్కులను కాపాడే స్పీకర్‌ను అవమానించారని సిఎం రేవంత్‌రెడ్డి మం డిపడ్డారు. అత్యంత అవమానకరంగా స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంతకంటే చర్చకు ప్రాధాన్యమున్న అంశం ఇంకేముంటుందని సిఎం రేవంత్‌రెడ్డి అడిగారు. ఇది స్పీకర్ గౌరవానికి సంబంధించిన విషయమని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సభాపతి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇవాళ తెలంగాణకు చీకటిరోజని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దూషించాలని కెసిఆర్ పురిగొల్పి పంపించారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
సభ్య సమాజం సహించలేని భాష మాట్లాడారు
సభ్య సమాజం సహించలేని భాష మాట్లాడారని సిఎం రేవం త్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులే కాదనీ, సభ్య సమాజానికే జరిగిన అవమానం ఇది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవానికే గాయమైందని స్పీకర్‌పై అత్యంత అసభ్యకరంగా మాట్లాడారని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
22ఏ నిషేధిత జాబితాపై సభలో చర్చ జరుపుతాం
అసెంబ్లీలో 22ఏ జాబితాపై చర్చ జరపాలని బిజెపి సభ్యులు చేసిన ఆందోళనపై సిఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ సభ నాయకుడిగా తాను మా టిస్తున్నానని బిజెపి లేవనెత్తిన 22ఏ నిషేధిత జాబితాపై సభలో చర్చ జరుగుతుందని ఆయ న స్పష్టం చేశారు. 22ఏ జాబితాపై చర్చ జరిగితే తమ భూ అక్రమ దందాలు బయటపడతాయన్న భయంతో అసెంబ్లీ బయట డ్రామాలు ఆడుతుందని ఆయన విమర్శించారు.
మనస్తాపం చెందాం: మంత్రి శ్రీధర్‌బాబు
స్పీకర్‌ను బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దుర్భాషలాడారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. తాతా మధు వ్యాఖ్యలపై అందరం మనస్తాపం చెందామని ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి సూచించారు. స్పీకర్ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత బిజెపికి లేదా అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదనీ, స్పీకర్‌ను దూషించడం దుర్మార్గమని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
కెసిఆర్ ఉసిగొల్పి పంపించారు: మంత్రి జూపల్లి
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సమావేశాలకు ముం దు రోజు బిఆర్‌ఎస్ సభ్యులను ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ఉసిగొల్పి పంపించారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ 80 వేల పు స్తకాలు చదవటం, అనర్గళంగా మాట్లాడటం కాదు.. సంస్కారం కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు. భవిష్యత్‌లో దుర్భాషలాడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కెసిఆర్ ముమ్మాటికీ దళిత వ్యతిరేకి: మంత్రి వివేక్
మంత్రి వివేక్ మాట్లాడుతూ కెసిఆర్ ముమ్మాటికీ దళిత వ్యతిరేకి అని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని ఆయన ఆరోపించారు. దళితులంటే బిఆర్‌ఎస్ నాయకత్వానికి అవమానించే ధోరణి ఆ పార్టీలో కొనసాగుతుందని ఆయన విమర్శించారు.
దళితులు బాధపడుతున్నారు: ఎమ్మెల్యే కడియం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు బాధపడుతున్నారన్నారు. 22ఏ పై బిజెపి నేతలు ఇప్పుడు డిమాండ్ చేయడం తగదని సీరియస్ ఇష్యూను డైవర్ట్ చేయవద్దని, డైల్యూట్ చేయవద్దని ఆయన సూచించారు. స్పీకర్‌కు జరిగిన అవమానంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
మధును బర్తరఫ్ చేయాలి: ఏలేటి
ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై బిజెపిఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సభలో మాట్లాడుతూ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడటం సరికాదన్నారు. తాతా మధు మాట్లాడిన భాషను బిజెపి ఎమ్మెల్యేలమంతా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు.ప్రతిపక్ష నాయకులు కెసిఆర్ కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాత మధు కావాలని అలా మాట్లాడారా? లేక ఎవరైనా మాట్లాడించారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి సంబంధించి తాతా మధును బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 22ఏకు సంబంధించి మంత్రి అధికారుల తప్పిదంగా పేర్కొన్నామంటే ఊరుకోమని ఏలేటి పేర్కొన్నారు.








