ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. సిఎం అమెరికా పర్యటనకు అ నుమతి నిరాకరణపై కేంద్ర మంత్రు లు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ప్రజలకు సమాధానం చె ప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. పేద, బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాల పిల్లలకు ప్రపంచస్థా యి విద్యను అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమం త్రి అమెరికా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సి ఎం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం

ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరని వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణకు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను తీసుకురావడం, విద్యా రంగంలో పెట్టుబడులు, అత్యుత్తమ విద్యా సంస్థల భాగస్వామ్యాలను రాష్ట్రానికి తీసుకురావడం వంటి అంశాల పై చర్చించాలన్నది సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. అ మెరికా పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి అ ధికారికంగా పంపించినప్పటికీ అనుమతి నిరాకరించడం దురదృష్టకరమని మంత్రి అన్నారు.