ఓటిటిలోకి వచ్చే సినిమాలో ప్రేక్షకులను ఎంత అలరిస్తాయో.. అందులో వచ్చే వెబ్ సిరీస్‌లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న వెబ్ సిరీస్ ‘వదంది’. 2022లో ఈ సిరీస్ తొలి సీజన్ వచ్చింది. ఎస్‌జె సూర్య ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో కూడా వచ్చిన ఈ సిరీస్‌కి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ని కొత్త స్టోరీ, కొత్త పాత్రలతో తెరకెక్కించారు. ఆగస్టు 07 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

‘వదంది : ది మిస్టరీ ఆప్ మణి’ పేరిట తీసిన ఈ వెబ్ సిరీస్‌లో శశి కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆండ్రూ లూయిస్ ఈ సీజన్‌కు దర్శకుడు కాగా స్టార్ డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రి క్రియేటివ్ దీన్ని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రధాన పాత్రధారి అయిన ఎస్సై చేసిన తప్పు వల్ల ఓ అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తాడు. తన తప్పు తెలుసుకున్న ఎస్సై.. ఆ వ్యక్తిని ఎలా జైలు నుంచి విడిపించాడు? చివరకు ఏమైంది అనేదే ఈ సిరీస్ స్టోరీ.