
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం యాద్గిర్ మండలంలో ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. కడేచూరు పరిశ్రమలో రసాయన వాయువు లీక్ కావడంతో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. మృతుల్లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన గణేశ్ ఉన్నాడు.











