
పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోదాం కుప్పకూలిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. కోల్‌కతాలోని తరతలలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తరతలలో వేర్‌హౌస్ నిర్మాణం జరుగుతోంది. దాదాపు 50 మందిదాకా వర్కర్లు బుధవారం వేర్‌హౌస్‌లో పని చేస్తున్నారు. మధ్యాహ్నం ఉన్నట్టుండి వేర్‌హౌస్ కుప్పకూలిపోయింది. వర్కర్లు అందరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు.ఇది గమనించిన స్థానిక జనం హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 21 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గ్యాస్ కట్టర్ల సాయంతో వేర్‌హౌస్ బీమ్‌లను కట్ చేసి మిగిలిన వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద స్థలిని సిఎం సువేందు అధికారి సందర్శించారు. సహాయక చర్యల వేగవంతానికి అధఙకారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.












