
చారిత్రక లార్డ్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దంచికొడుతున్నాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్, శుభ్ మన్ గిల్ లు మంచి శుభారంభాన్ని అందించారు. గిల్(77) అర్ధ శతకంతో రాణించగా.. రోహిత్ శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సూపర్ సెంచరీ సాధించాడు. రోహిత్ భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ప్రస్తుతం భారత్ 34 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 227 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్(117), విరాట్ కోహ్లీ(26)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 161 పరుగులు కావాల్సి ఉంది.











