విపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం

బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో రభస

విద్యార్థులపై పోలీసుల దమనకాండకు హోంమంత్రి అమిత్‌షాయే బాధ్యుడని తీవ్ర ఆరోపణ

ఎన్‌డిఎ నేతల అభ్యంతరం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం

రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ 

న్యూఢిల్లీ: దేశంలోని లక్షలాది మంది అభ్య ర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం తీ సుకువచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు- 2026’కు లోక్‌సభ బుధవారం ఆమో దం తెలిపింది. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ అవి వీగిపోయాయి. పేపర్ లీ క్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని. బిల్లులో ఇందుకు అవ సరమైన సవరణలు పొందుపరిచామని కేం ద్రం తెలిపింది. అనుభవాల నుంచి పాఠాల ను నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి తాము తీసుకు వచ్చిన స వరణ బిల్లే నిదర్శనమని పేర్కొంది.

నీట్ పేపర్ లీక్, అవకతవకలు, విద్యా వ్యవస్థపై పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలకు దిగడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం అంగీకరించడం వంటి వరుస పరిణామాల నేపథ్యంలో జూలై 27న ‘ప్రభుత్వ పరీక్షల (నిరోధక) సవరణ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

అనంతరం సభలో చర్చ చేపట్టారు. చర్చలో భాగంగా ఆయా పార్టీల సభ్యులు మాట్లాడిన అనంతరం చివరగా జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. నీట్ పేపర్ లీకైన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించిందని, 2024లో పేపర్ లీక్‌ల నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 52కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వివరించారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి సవరణ బిల్లే నిదర్శనమని చెప్పారు. పేపర్ లీక్‌లకు సంబంధించి ఆత్మహత్యా ఘటనలు కూడా గత కొన్నేళ్లుగా గణనీయంగా తగ్గాయని చెప్పారు.

విపక్ష నేత రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు గుప్పించారు. పార్లమెంటరీ నిబంధనలు, ప్రభుత్వం పనితీరుపై ఆయన సరైన అవగాహన లేదని అన్నారు. బిల్లు పాసేజ్ కానున్న సమయంలో విపక్ష పార్టీలు నినాదాలు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లుపై సీరియస్‌గా చర్చించడం, సూచనలు ఇవ్వడానికి బదులు రాజకీయాలకు పాల్పడుతున్నాయని తప్పుపట్టారు. విపక్ష పార్టీల ప్రవర్తను దిగ్భ్రాంతికరంగా ఉందన్నారు. జితేంద్ర ప్రసాద్ ప్రసంగం అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అనంతరం సభను గురువారానికి స్పీకర్ వాయిదా వేశారు.

బిల్లులో అంశాలివే..

యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇతరులు నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో అవకతకవకల నిరోధించేందుకు ప్రభుత్వం ‘యాంటీ పేపర్ లీక్’ బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం లీక్ కేసుల్లో దోషులకు పదేళ్ల వరకూ జైలుశిక్ష, రూ.10 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. గతంలో ఇందుకు 3-నుంచి 5 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల వరకూ జరిమానా ఉండేది. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష కోటి వరకూ జరిమానా ఉంది.

పేపర్ లీక్ కేసుల్లో విచారణ రెండు నెలల్లోగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఛార్జిషీట్లు దాఖలు చేసిన తేదీ నుంచి మూడు నెలల్లోగా తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. తీర్పును హైకోర్టులో సవాలు చేయాలంటే నెలరోజుల వ్యవధి ఉంటుంది. ఆ తర్వాత కూడా మూడు నెలల్లోగా కోర్టు తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి నేరాలపైన అయినా విచారణ జరిపేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే అధికారం ఈ బిల్లుతో కేంద్రానికి సంక్రమిస్తుంది.

విద్యార్థులకు శుభాకాంక్షలు: అమిత్‌షా

విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం తీసుకువచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026కు లోక్‌సభ ఆమోదం తెలిపడంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్తులందరికీ హోం మంత్రి అమిత్‌షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ చట్టంపై పోటీ పరీక్షల్లో పారదర్శకత పెరిగి, అక్రమాలకు అడ్డుపడుతుందన్నారు. నిజాయితీగా శ్రమించే విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ కలుగుతుందని చెప్పారు. ప్రతిభ ఆధారంగా అవకాశాలు లభించే వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇదొక కీలక మైలురాయని అభివర్ణించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఎలాంటి ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు.