
బెంగళూరు: సుమారు 270 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెనక్కి తిరిగి వచ్చింది. ఈ ఘటన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. షెడ్యుల్ ప్రకారం విమానం ఆదివారం ఉదయం 8.20 గంటలకు లండన్‌కు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలట్ గుర్తించి విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు.
విమానాన్ని అరగంట సేపు గాలిలో చక్కర్లు కొట్టించిన అనంతరం వినానాన్ని వెనక్కి తీసుకువచ్చి కెంపెగౌడ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ఏమినేది వెంటనే తెలియలేదు. ప్రస్తుతం విమానాన్ని తనిఖీలకు తరలించి దర్యాప్తు చేపట్టారు.








