మన తెలంగాణ/సిటీబ్యూరో: మైక్రో ఫైనాన్స్ కేసు కీలక మలుపు తిరిగింది. తమకు మైక్రో ఫైనాన్స్‌తో సంబంధం లేదని ఇప్పటిదాకా వాదించిన మంగ్లీ కుటుంబానికి షాక్ తగిలింది. నిందితుడు రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి మంగ్లీ సోదరు డు శివ బ్యాంక్ ఖాతాకు మూడు సార్లు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు గుర్తించారు. అదేరోజు శివ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసినట్లు బయటపడింది. మైక్రోఫైనాన్స్ పేరుతో రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు రమావత్ మధు ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసు లో మంగ్లీ, ఆమె సోదరుడు శివకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వచ్చాయి. విచార ణ చేసిన పోలీసులకు మధు బ్యాంక్ ఖాతా నుంచి శివ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు తెలిసిం ది.

అయితే ఎంత మనీ బదిలీ అయిందో పోలీసు లు బయటికి చెప్పలేదు. మధును అరెస్టు చేసిన వెంటనే సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అతడి బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు. రమావత్ మధు, హిమకాంత్‌రెడ్డి, శివ చౌహాన్‌కు చెం దిన అకౌంట్ల పూర్తి వివరాలు ఇవ్వాలని సంబంధి త బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. మరోవై పు నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేద ని, ఈ కేసులో తమ పేర్లను అనవసరంగా లాగుతున్నారని మంగ్లీ, ఆమె సోదరుడు శివచౌహాన్ ఆరోపిస్తున్నారు. రమావత్ మధు అధిక వడ్డీ పేరుతో వేల మంది నుంచి రూ.వందల కోట్లు వసూలు చేశాడనే ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పోలీసులకు మరిన్నీ ఆధారాలు లభిస్తే మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.