ఐక్యూ సంస్థ భారత్‌లో జెడ్11 లైట్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.17,999 కాగా, ఈ నెల 30 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల 120 హెట్జ్ డిస్‌ప్లే, 1200 నిట్స్ బ్రైట్‌నెస్, 6500 ఎంఎహెచ్ బ్యాటరీ, 44డబ్లు ఫ్లాష్‌ఛార్జ్ సదుపాయం ఉన్నాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 50ఎంపి సోనీ కెమెరా, ఐపి65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, అనేక ఎఐ ఫీచర్లు ఉన్నాయి.