
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి అనే విషయం అందరికీ తెలిసిందే.. తరచూ ఆతడు సేవ కార్యక్రమాలు చేస్తుంటాడు. రీసెంట్‌గానే విజయ్.. రష్మికను వివాహం చేసుకున్నాడు. ఆ సందర్భంగా తమ స్వగ్రామం అయినా నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. అప్పుడు ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తా ప్రకటించాడు విజయ్
‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్‌లోని విద్యార్థుల ‘మెరిట్ స్కాలర్‌షిప్స్ అవార్డీస్’ జాబితాను విడుదల చేశారు. ఇందులో మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఉపకారవేతనాలు అంజేయనున్నారు. దీంతో విజయ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గ్రామస్థులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.











