
అగ్ర కథానాయిక నయనతార ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సూపర్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘హాయ్’, ‘టాక్సిక్’, డియర్ స్టూడెంట్స్’ తదితర సినిమాలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ మరో సినిమాకి కూడా ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘కాంచన’ సినిమాల సిరీస్‌లో భాగంగా రాఘవ లారెన్స్ ‘కాంచన-4’ చిత్రాన్ని ప్రారంభించిన విషయ తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు నయనతార కూడా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందని టాక్. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలి అంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.












