హైదరాబాద్:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం(2026, ఆగస్టు 27) ఉదయం మీరాలం చెరువును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను సిఎం రేవంత్ పరిశీలించారు. ప్రస్తుతం మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జీ నిర్మస్తున్నారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సిఎంకు అధికారులు వివరించారు. బ్రడ్జీ పనులను గడువులోగా పూర్తి చేయాలని సిఎం, అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని.. చెరువులో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ చేయాలని సూచించారు. అలాగే, చెరువులో ఉన్న ఐల్యాండ్‌ను అభివృద్ధి చేయాలని.. పర్యాటకులను ఆకట్టుకునేలా చెరువును తీర్చిదిద్దాలని రేవంత్ అధికారులను ఆదేశించారు.