కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ నుంచి మంత్రులకు అనూహ్యంగా ఓ ప్రశ్న ఎదురైంది. మీరంతా సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారా? అని ప్రశ్నించినట్లు సమాచారం. యువతకు మరింత చేరువయ్యేందుకు కేంద్ర మంత్రులు ఇన్‌స్టా వంటి వేదికల్లో క్రియాశీలంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది యాక్టివ్‌గా ఉంటున్నారని మోడీ ఈ సందర్భంగా మంత్రులను ప్రశ్నించారు. యువత ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నారని, అందులో ఇన్‌స్టాను అధిక సంఖ్యలో ఉపయోగిస్తున్నందున అందులో యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన

వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినంత మాత్రాన సరిపోదని ప్రధాని మంత్రులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో నేరుగా యువతతో టచ్‌లో ఉం డాలని ప్రధాని సూచించారు. యువతకు మరిం త దగ్గర చేసే రీల్స్ వంటి క్రియేటివ్ కంటెంట్‌ను పోస్టు చేస్తూ ఉండాలని కూడా ప్రధాని సూచించినట్టు తెలిసింది. పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా చట్టంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. గురువారంనాడు అర్ధరాత్రి తన సందేశాన్ని ఇన్‌స్టా ద్వారానే మోడీ పోస్టు చేసిన సంగతి తెలిసిందే