హైదరాబాద్: మెహదీపట్నంలో విజయనగర్ కాలనీ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం తప్పింది. అపార్ట్ మెంట్ ఐదో అంతస్తులోని  బెడ్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.