హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విఫలం కావడంతో అతడిని జట్టు నుంచి తొలగిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సీనియర్లు అతడి అనుభవం జట్టుకు ఎంతో అవసరం పడుతుందని, రోహిత్‌కు 2027 వరల్డ్ కప్‌లో చోటు కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. రోహిత్ సేవలను వినియోగించుకొని వరల్డ్ కప్ గెలవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే ఆడిన అనంతరం రోహిత్‌కు వీడ్కోలు పలుకుతారని పెద్ద చర్చ జరుగుతున్న సందర్భంగా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ స్పందించారు.. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సికి 39 ఏళ్లు ఉన్నప్పటికి తన జట్టును ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చాడని గుర్తు చేశారు. సెమీస్ మెస్సి ఒక్క గోల్ చేయనప్పటికి అనుభవంతో కీలకమైన అసిస్ట్ ఇచ్చాడని ప్రశంసించారు. మ్యాచ్‌ను ఫినిష్ చేసేందుకు కురాళ్లు కావాలని, కానీ సరిగ్గా గైడ్ చేయడానికి అనుభవం కలిగిన ఆటగాళ్ల అవసరం ఉందని నొక్కి చెప్పారు. అర్జెంటినా జట్టు మెస్సి సేవలు ఎంతో అవసరమో అలాగే టీమిండియా జట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవసరం కూడా ఉందని సూచించారు. అది ఫుట్ బాల్ మ్యాచ్చా.... క్రికెట్ మ్యాచ్చా అనేది అనుభవం పోషించే కీలకంగా మారుతుందని తెలియజేశారు. వన్డేల్లో రోహిత్, విరాట్ అనుభవం వంద శాతం అవసరం ఉందని, ఇద్దరు లేకపోతే టీమిండియా నష్టం చేకూరుతుందని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా పిచ్‌లు కఠినంగా ఉంటాయని, బౌన్స్ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం సులువు కాదని, ఇద్దరు ఫామ్ అందుకునే వరుకు వాళ్లతో మ్యాచ్‌లు ఆడించాలని సలహాలు ఇచ్చారు.