
ముంబై : మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఈటీ) ప్రశ్నాపత్రం లీక్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి బిజేంద్ర గుప్తా బీహార్‌లో అరెస్ట్ అయ్యాడు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతడు బీహార్‌లో ఉన్నట్టు తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. బిజేంద్ర గుప్తా, అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.
ట్రాన్సిట్ రిమాండ్‌పై మహారాష్ట్రకు తీసుకువచ్చి టెట్ పేపర్ లీక్ నెట్‌వర్క్, ఇలాంటి కేసుల్లో అతడి ప్రమేయాన్ని ప్రశ్నించనున్నారు. దేశ వ్యాప్తంగా ఇతర పరీక్ష పత్రాల లీక్ సిండికేట్‌లతో బిజేంద్ర గుప్తాకు ఉన్న సంబంధాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. టెట్ పేపర్ లీక్ కేసులో బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. గుప్తా, అతడి అనుచరుడి అరెస్టుతో ఈ సంఖ్య 14కు చేరింది.








