
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఆదివారం తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ప్రత్యేకమైన ఎఐ వీడియోతో మహేశ్‌కి విషెస్ తెలిపారు. దీనికి మహేశ్ కూడా ఫిదా అయ్యారు. దివంగత లెజండరీ నటుడు కృష్ణ ‘కిరాయి కోటిగాడు’ సినిమాలో చెప్పిన ఐకానిక్ డైలాగ్‌ను ఎఐ ద్వారా సందీప్ రీక్రియేట్ చేశారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాపై గతంలో జరిగిన చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ప్రచారంలోకి వచ్చిన ‘డెవిల్’ ప్రాజెక్ట్‌పై సందీప్ హిట్ ఇచ్చారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.








