
దుబాయి: మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. దుబాయి వేదికగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఈ టోర్నీ జరుగనుంది. ఇందులో భారత్, పాకిస్థాన్‌తో సహా మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. చిరకాల ప్రత్యర్థులు ఒకే గ్రూపులో ఉన్నాయి. హాంకాంగ్, థాయిలాండ్‌లు కూడా ఇదే గ్రూపులో చోటు దక్కించుకున్నాయి. మరో గ్రూపులో శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎఇ, ఇండోనేసియా జట్లు ఉన్నాయి. అన్ని మ్యాచ్‌లు దుబాయిలోనే జరుగుతాయి.
కాగా, భారత్ ఆసియా కప్‌లో తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30న థాయిలాండ్‌తో ఆడనుంది. ఇదిలావుంటే ఇప్పటి వరకు మహిళల విభాగంలో తొమ్మిది సార్లు ఆసియాకప్‌ను నిర్వహించారు. ఇందులో భారత జట్టు రికార్డు స్థాయిలో ఏడు సార్లు విజేతగా నిలువడం విశేషం.











