మల్కాజిగిరి: నాలుగేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మల్కాజిగిరిలో రవి కుమార్ అనే యువకుడు టెంట్‌హౌస్‌లో పని చేస్తున్నాడు. టెంట్‌హౌస్‌కు ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్‌లో నాలుగేళ్ల బాలిక ఆడుకుంటుంది. చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ తల్లికి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.