
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ’దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. దర్శకుడు మాట్లాడుతూ అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకుతెస్తుంది. ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి.
అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ చిత్రలహరి పోగ్రామ్ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ల గోల్డెన్ డేస్‌లోకి తీసుకు వెళ్తుంది అని అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న కథ ఇది‘అని పేర్కొన్నారు.














