
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హెచ్చరిస్తున్నట్లు సృష్టించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో ఫేక్ అని పిఐబి క్లారిటీ ఇచ్చింది. అది పూర్తిగా ఎఐతో సృష్టించారని స్పష్టం చేసింది. అందులో చూపినట్లు ప్రధాని విద్యార్థులకు ఎటువంటి హెచ్చరికలు చేయలేదని పేర్కొంది.
పరీక్షా విధానంలో సంస్కరణలపై సిఫార్సులకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థఆపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఇటీవల మోడీ ప్రకటిస్తూ.. ఓ వీడియో షేర్ చేశారు. కొన్ని నెట్‌వర్క్‌లు దాదాని ఎఐతో మార్ఫింగ్ చేసి.. సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాయని పిఐబి తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా అనుమానాస్పద, ఫేక్ కంటెంట్ ప్రజల దృష్టికి వస్తే తమకు రిపోర్టు చేయాలని కోరింది.











