
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్ సోదరుడు అర్జూ, మరో వ్యక్తి టైసన్‌లకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆమిర్ మూడో వివాహం చేసుకొని మతపరమైన వివాదానికి తావిచ్చారని.. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని వారు హెచ్చరించారు. త్వరలోనే దీనికి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఆడియోలో బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇటీవల ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై మతపరమైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయంపైనే బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఇటీవల కొందరు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఈ గ్యాంగ్ బెదిరించింది.











