ఢిల్లీ: బళ్లారి- గుంతకల్లు మధ్య అదనపు లైన్లతో ఎపి, కర్ణాటకకు ఉపయోగం అని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ లైన్ లో వేదవతి నదిపై పెద్ద వంతెన నిర్మిస్తామని అన్నారు. భవ్య రసాయన్ పథకానికి కేబినెట్ ఆమోదించింది. కేంద్రమంత్రి వర్గం నిర్ణయాలు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బళ్లారి- గుంతకల్లు లైన్లు మూడేళ్లలో పూర్తి చేస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు. బళ్లారి- గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్లు, రూ. 1,264 కోట్లతో మూడు, నాలుగో రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తామని, బళ్లారి- గుంతకల్లు మధ్య 46 కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏటా అదనంగా కోటీ 60 లక్షల టన్నుల సరకు రవాణాకు అవకాశం ఉంటుందని, బళ్లారి- గుంతకల్లు లైన్ లో 52 స్మాల్, 7 మేజర్, ఒక మెగా బ్రిడ్జి నిర్మిస్తాం అని చెప్పా రు. మూడు డెడికేటెట్ కెమికల్ పార్కులు ఏర్పాటు చేస్తామని, ఒక్కో కెమికల్ పార్కుకు రూ. వెయ్య కోట్లు కేటాయిస్తామని అన్నారు. రసాయనాల పరిశ్రమల బలోపేతానికి లక్ష్యంగా భవ్య రసాయన్ స్కీమ్ అని రసాయనాల తయారీలో ఆత్మ నిర్భరత సాధనే లక్ష్యంగా ఈ స్కీమ్ అని ఒక్కో పార్కును 8 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తామని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.