ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంకల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌కి ముందు ఇరు దేశాల మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకు మంచి ఆరంభం లభించింది. నిషాన్ మధుశంక, రవిందు రసంత కలిసి తొలి వికెట్‌కి 110 పరుగుల భాగస్వామయం అందించారు. హాఫ్ సెంచరీ సాధించిన మధుశంక(66) రనౌట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన పసిందు(35), పవన్(39) గౌరవప్రదమైన స్కోర్ చేశారు.

ఇక రవిందు రసంత 71 పరుగులు చేయగా.. కెప్టెన్ సోనల్ దినుషా 52 పరుగులు చేశాడు. రమేశ్ మెండిస్ 32 పరుగులు చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేశరా నువాంత (9), దిలుమ్ సుధీరా (1) ఉన్నారు. భారత బౌలింగ్‌లో జడేజా, మానవ్ , కుల్దీప్ చెరి రెండు, గుర్నూర్ బ్రార్ 1 వికెట్ తీశారు.