
రాయ్‌పూర్: ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఎంఐపై ఆర్‌సిబి రెండు వికెట్లు తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి బ్యాటింగ్ చేసి 167 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ ముందు ఉంచింది. ఆర్‌సిబి 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయం సాధించింది. చివరలో కృనాల్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పాండ్యా 46 బంతుల్లో 73 పరుగులు చేసి విజయం కీలక పాత్ర పోషించాడు. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆర్‌సిబి విజయం సాధించింది. భువీ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి 23 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో భువీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంలో పాయింట్లో ఆర్‌సిబి తొలి స్థానానికి చేరుకుంది.














